కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ మదనారీవర సుదతి మహేశ్వరి
కానడ - ఆది
పల్లవి:
మదనారీవర సుదతి మహేశ్వరి
మాతంగి నాపై అభిమానమెన్నడు గల్గు
॥మదనారీ॥
అనుపల్లవి:
మదరాక్షసహరి మాధవసోదరి నీ
పదరాజీవ సద్భక్తిసంపద నే కోరితి
॥మదనారీ॥
చరణము(లు):
ఆజన్మము నా అంతరంగమున
తేజరిల్లు నీ దివ్యరూపముగోరి
ఈజగతి నిన్నె పూజించు రాఘవుని
మోజుదీరగ నీ మోమొకసారి జూపవు
॥మదనారీ॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - madanArIvara sudati mahESvari - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )