కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ సితనగ నిలయుని సుదతీ సుమతీ
వివర్ధిని - ఆది
పల్లవి:
సితనగ నిలయుని సుదతీ సుమతీ
శ్రితజనానంద చిద్రూపిణి
॥సితనగ॥
అనుపల్లవి:
వితరణగా నా విన్నపమాలించి
వెతదీర్ప నిదేవేళ వివర్ధిని
॥సితనగ॥
చరణము(లు):
పురాతనముగా ధరాతలిని కడు
విరామములేని జరామరణముల
పురాణి వగజెందు రాఘవుని గని
వరాలొసగి బ్రోవ రావలె జనని
॥సితనగ॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - sitanaga nilayuni sudatI sumatI - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )