కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ నన్నుబ్రోవ నీకన్న వేరెవ్వ
సారంగ - ఆది
పల్లవి:
నన్నుబ్రోవ నీకన్న వేరెవ్వ
రున్నారు ఆపన్నరక్షణి ఇలలో
॥నన్ను॥
అనుపల్లవి:
కన్నతల్లి ఆదిలక్ష్మీ కామేశ్వరి
తిన్నగా భవాబ్ధి దాటించి దయతో
॥నన్ను॥
చరణము(లు):
గుట్టువిడచి సాటి నరుల చెంతజేరి
పొట్టకూటికై బొంకులాడగలనా
దిట్టరివని నమ్మిన రాఘవుని
రట్టుదీర్చు దీనరక్షణివి గావా
॥నన్ను॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - nannubrOva nIkanna vErevva - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )