కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ కామేశ్వరి నీపదకంజములే గతియని
కాంభోజి -ఖండజాతి త్రిపుట
పల్లవి:
కామేశ్వరి నీపదకంజములే గతియని
నమ్మి పూజించెదనే శివ
॥కామేశ్వరి॥
అనుపల్లవి:
ఈమేదిని అరుదై దొరకే నర
జన్మ తనకబ్బియున్న ఈవేళనె
॥కామేశ్వరి॥
చరణము(లు):
మనసార తులసీ బిల్వాది కుముద
మందారారవింద మల్లికా సుమములచే
నెనరుమీర ఆగమవిధి ననుసరించి
దినదినము రాఘవుని మై పులకరింప
॥కామేశ్వరి॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - kAmESvari nIpadakaMjamulE gatiyani - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )