కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ వదలిపోయేనాడు నీవెంటతోడై
పూర్వీకల్యాణి - ఆది
పల్లవి:
వదలిపోయేనాడు నీవెంటతోడై
వచ్చువారెవరున్నారే ఓమనసా ఈ తనువు
॥వదలి॥
అనుపల్లవి:
విధివశుడై తానెడతెగ కార్జించి
పొదుపుజేసిన పుణ్యపాపములే గాక
॥వదలి॥
చరణము(లు):
ప్రేమజూపు నిజభామామణిగాని
నోముల నోచికన్న ఆత్మజులేగాని
పామరుడై బాగాదాచిన ధనముగాని
ఈ మహిలోనే విడచి యమకింకరులపాలై
॥వదలి॥
మేరలేని భోగభాగ్యములందు మోజు
దీరక బహుదుర్విషయాదుల మరగి
ఘోరపాప కర్మాధీనుడై రాఘవుని
దూరి శ్రీ దేవీగానసుధా పానము జేయక
॥వదలి॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - vadalipOyEnADu nIveMTatODai - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )