కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ అంతా బ్రహ్మమయమురా
మోహన - ఆది
పల్లవి:
అంతా బ్రహ్మమయమురా
ఈ జగదుదంత మెరిగిన నిగమాంత కోవిదుల
॥కంతా॥
అనుపల్లవి:
సంతతధామ మనంతనామ మా
ద్యంత రహితమై అహరహము వెలిగే
॥దంతా॥
చరణము(లు):
సకల భూత కులమతముల తా నిష్క
ళంకమై నెగడు నిర్వికారమురా
ప్రకటిత రాగభావతాళ చయమం
దొకటై తనరు రాఘవార్చిత నాదాఖండ
॥మంతా॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - aMtA brahmamayamurA - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )