కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ రావమ్మ జననీ శ్రీ రాజరాజేశ్వరి మాయింటిదాక
రీతిగౌళ - మిశ్రజాతి చాపు
పల్లవి:
రావమ్మ జననీ శ్రీ రాజరాజేశ్వరి మాయింటిదాక ॥రావమ్మ॥
అనుపల్లవి:
భావజారి హరిబ్రహ్మేంద్రాది సురగణములగూడి ॥రావమ్మ॥
చరణము(లు):
రాజిల్లు శరన్నవరాత్రులందు నీసేవ
మోజు దీరగజేసి మ్రొక్కెద సాష్టాంగముగ
ఈ జన్మమందే నీకృప యేర్పడజూచి రాఘవునిబ్రోవ
॥రావమ్మ॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - rAvamma jananI SrI rAjarAjESvari mAyiMTidAka - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )