కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ కాలవికృతమున పాలబడు కష్ట
వరాళి - ఆది
పల్లవి:
కాలవికృతమున పాలబడు కష్ట
జాలములకు భయమేలనే మనస
॥కాల॥
అనుపల్లవి:
జాలిదీర్చి భక్తపాలనజేయు
ఫాలనేత్రి మనపాల గల్గియుండ
॥కాల॥
చరణము(లు):
దారసుతులతో గూడిన యీ సం
సారమున సుఖవిచారములేప్రొద్దు
వేరుగాక ఆమరణము నరునికి
చేరువై నెగడు రాఘవాఘఫల
॥కాల॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - kAlavikR^itamuna pAlabaDu kaShTa - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )