కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ అందుకొనవమ్మా ఓ త్రిపుర
సావేరి - ఆది
పల్లవి:
అందుకొనవమ్మా ఓ త్రిపుర
సుందరీ కర్పూరానంద నీరాజన
॥మందుకొన॥
అనుపల్లవి:
ఇందరిలో నా డెందము రంజిల్ల
వందనము జేసి వసుధ నిను దలతు
॥నందుకొన॥
చరణము(లు):
భావరాగతాళముల జతగూర్చి
పావనమగు నీనామాక్షర గాన ప్ర
భావముచే భక్తవాహినిలో శ్రీ
దేవీగానసుధాకృతిగా నినుజూచితి
॥నందుకొన॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - aMdukonavammA O tripura - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )