కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ చెప్పుకొంటినమ్మా జననీ నా
ముఖారి - ఆది
పల్లవి:
చెప్పుకొంటినమ్మా జననీ నా
త్రిప్పట లెల్ల నీతో
॥చెప్పుకొంటి॥
అనుపల్లవి:
మెప్పులేని ధనకాములతో వియ్యము
తప్పదాయె తగుధనమెటు చేకూర్తువొ
॥చెప్పుకొంటి॥
చరణము(లు):
ఏనాటి పాపమో ధనహీనులై కొంద
రీనాటి మానవులు మగువల గను
చున్నారిల విధివశమున దీనులై యా
పన్నరక్షకీ జగము తీరెల్ల రాఘవుని
॥చెప్పుకొంటి॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - cheppukoMTinammA jananI nA - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )