కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ ఎందుకీ భువిలో నరుడై తా
కీరవాణి - ఆది
పల్లవి:
ఎందుకీ భువిలో నరుడై తా
నేర్పడెనో ఎంచి చూడవే మనసా
॥ఎందుకీ॥
అనుపల్లవి:
అందరాని దుర్మోహ దురాశల
జెంది సతత మీభవబంధమున వగచుటకా
॥ఎందుకీ॥
చరణము(లు):
పరమత కులముల దూరుటకా లేక
పరమార్థమెరిగి ధర్మాచరణుడౌటకా
సరసాత్ములతో విరసములాడుటకా భూ
సురుడౌ రాఘవుడు భోగలాలసుడౌటకా
॥ఎందుకీ॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - eMdukI bhuvilO naruDai tA - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )