కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ తల్లీ సదా నీపద
మణిరంగు - ఆది
పల్లవి:
తల్లీ సదా నీపద
పల్లవములె కదా నమ్మినారము
॥తల్లీ॥
అనుపల్లవి:
ఉల్లాసమెంతో గల నా
ఉల్లము రంజిల్ల పూజించి
॥తల్లీ॥
చరణము(లు):
ఎన్ని జన్మలకైనా తుదకు నీ
సన్నిధిజేరు సౌభాగ్యమె
ఉన్నతమని యెంచి యుప్పొంగుచు
అన్నివేళల ఆజన్మముకోరి
యున్న రాఘవుని కోర్కె లాలించి బ్రోచు
॥తల్లీ॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - tallI sadA nIpada - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )