కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ కలుగునా కామాక్షీ నీదయలేక
కేదారగౌళ - మిశ్రజాతి ఝంపె
పల్లవి:
కలుగునా కామాక్షీ నీదయలేక
కలిమానవులకు నీ పదకంజములపై భక్తి
॥కలుగునా॥
అనుపల్లవి:
ఇలధనదార సుతాది దుర్మోహ దురాసక్తులై
పలుజన్మల భవబద్ధులైన పామరులకు
॥కలుగునా॥
చరణము(లు):
పరమ భాగవతులను శంకించు నపచారులై
వెరపులేక పరదార గమనోల్లాసులై
స్థిరముగాని తమ కలిమి బలమున కుప్పొంగుచు
దురితాత్ములై చరించి రాఘవుని దూరితె
॥కలుగునా॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - kalugunA kAmAxI nIdayalEka - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )