కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ శంకర కోమలి శరణుజొచ్చితి నీ పద
దర్బారు - ఆది
పల్లవి:
శంకర కోమలి శరణుజొచ్చితి నీ పద
పంకజములె నమ్మి భవభయహారి శివ
॥శంకర॥
అనుపల్లవి:
సంకటముల దీర్చి సద్భక్తి గూర్చి నా
వంకజూచి బ్రోతువని వరదాయకి శివ
॥శంకర॥
చరణము(లు):
సరసామృత దుఘవీక్షణముచే నన్ను
పారజూచి పరిపాలింతువని
స్మరజనక సోదరీ చిరకాలముగా
చేరి నీ సన్నిధిని రాఘవనుత
॥శంకర॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - SaMkara kOmali SaraNujochchiti nI pada - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )