కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ తనవారని నమ్మిచెడకురా నిజ
సామ - ఆది
పల్లవి:
తనవారని నమ్మిచెడకురా నిజ
తరుణీ తనయ దాయాద స్వజనులంతా
॥తన॥
అనుపల్లవి:
మనసార స్మరరిపు మానినీపద
మారాధించుటె తుదకాధారమౌ గానీ
॥తన॥
చరణము(లు):
వట్టి బూటకానుబంధ మిదని బాగా
తట్టి నీకెవ్వరీగుట్టు తెల్పేరు
మట్టిపాలై మాపోరేపో మరెన్నడో
మటుమాయమౌ ఈ దేహభ్రాంతి మానలేక రాఘవ
॥తన॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - tanavArani nammicheDakurA nija - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )