కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ జ్ఞానభిక్షమిడవే జననీ నా య
బహుదారి - ఆది
పల్లవి:
జ్ఞానభిక్షమిడవే జననీ నా య
జ్ఞానమణచి సుజ్ఞానునిగాజేయు
॥జ్ఞాన॥
అనుపల్లవి:
జ్ఞానప్రసూనాంబా యీభవ
కాననమున తుదిగానలేక నిను వేడితి
॥జ్ఞాన॥
చరణము(లు):
కన్నతల్లి యాపన్నరక్షకీ నా
విన్నపము విని ప్రసన్నమూర్తివై
నిన్నెగాని తన మనసున కన్యము
ఉన్నతిగాదని యుప్పొంగు రాఘవునికి
॥జ్ఞాన॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - GYAnabhixamiDavE jananI nA ya - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )