కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ నీకే దయరాదా జననీ నాపై
చక్రవాక - ఆది
పల్లవి:
నీకే దయరాదా జననీ నాపై
నేరములెల్ల సైరించి బ్రోచుటకు
॥నీకే॥
అనుపల్లవి:
రాకేందుముఖి సదాశివరాణివై
రాజిల్లుచూ త్రిభువనరక్షణివైన
॥నీకే॥
చరణము(లు):
భారమైన భవబాధలణచి కడ
తేర జూచి కరుణించుట కెవరే
మారజనకసోదరి శంకరి నను
చేర బిలిచి నీకుమారునిగా జూడ
॥నీకే॥
ఏవేళను నాకీవే గతియని
భావించి నీ పదభక్తి జేసెద
రావే దీనరక్షకి రాఘవుని
సేవలందుకొని బ్రోవను మదిలో
॥నీకే॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - nIkE dayarAdA jananI nApai - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )