కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ వలసినదేమీ జననీ మాకీ
రీతిగౌళ - ఖండత్రిపుట
పల్లవి:
వలసినదేమీ జననీ మాకీ
వసుధ నీదు పదవనజ భక్తికన్న గా
॥వలసిన॥
అనుపల్లవి:
పలువిధముల భవబాధలణచి బ్రోచె శివ
భామినివై మాపాల గల్గియుండగా
॥వలసిన॥
చరణము(లు):
ఆనాడె కడు చిరుప్రాయమున రాఘవుని
శ్రీనాథానంద సద్గురు లతి కృపతో
నీనామ జపవిధి నిధులను బోధించి
జ్ఞానానంద పరతత్వాయత్త చిత్తుని జేసె
॥వలసిన॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - valasinadEmI jananI mAkI - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )