కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ మనసా సదాశివ మానిని
సురట - ఆది
పల్లవి:
మనసా సదాశివ మానిని
నామాక్షరము లేమరక భజింపవే ఓ
॥మనసా॥
అనుపల్లవి:
వనజాసన హరిహర సురపతులెల్ల
నెనరున త్రిభువనాధీశ్వరి యని పొగడిరి
॥మనసా॥
చరణము(లు):
పలు జనన మరణ బాధ లణచి ఇహ
పర సుఖము లిడి పరిపాలించునట
ఇల ఈ నరజన్మ మబ్బి యున్నపుడె స
ఫలముగ జేయవె జ్ఞానానంద తీర్థుని
॥మనసా॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - manasA sadASiva mAnini - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )