కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ రారె రమణులంతా శ్రీ రాజ
కేదార - ఆది
పల్లవి:
రారె రమణులంతా శ్రీ రాజ
రాజేశ్వరికి కర్పూర హారతు లివ్వ
॥రారె॥
అనుపల్లవి:
తీరెరిగిన త్రిభువనపాలినిగా తా
పార జూచి భక్తపాలన జేయునట
॥రారె॥
చరణము(లు):
హరిహరసుర మునివరులెల్ల సేవింప
దరహాస వదనయై దయజూపు వేళనే
॥రారె॥
భారమనక భవ బాధలణచి మన
సార వరము లిచ్చి లాలించు లలితాంబ చెంతకు
॥రారె॥
అన్ని వేళల ఈ నరజన్మమందె మనను
కన్నతల్లిగా బిలచి గారవించునట
॥రారె॥
మానక శ్రీ దేవీగానసుధా రస
పాన మత్తచిత్తులై జ్ఞానానందతీర్థునితో
॥రారె॥
పరమ భక్తజనపాలిని కమల కపాల గదాంకుశ
ధారిణి శూలిని నేమరక సదా మాధవ సోదరి
నామభజన మనసార జేయుచూ
॥రారె॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - rAre ramaNulaMtA SrI rAja - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )