కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ అపార కృపానిధివని నీనామ
జ్ఞానానందవర్ధని - ఆది
పల్లవి:
అపార కృపానిధివని నీనామ
మేపార నామది నుపాసింతునే అంబ
॥అపార॥
అనుపల్లవి:
కపాలశంఖచక్రగదాంకుశ ఖడ్గధారిణి
మాపాలి దైవమా శ్రీ మహేశ్వరి గాయత్రి
॥అపార॥
చరణము(లు):
సనాతనీ సచ్చిదానంద రూపిణి
శ్రీనాథానంద సద్గురు తీర్థోపాసిని
అనాదిగా హరిహరాది సురలెల్ల
ఘనాభి నుతులిడరె జ్ఞానానంద తీర్థార్చిత
॥అపార॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - apAra kR^ipAnidhivani nInAma - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )