కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ పరశివ సుదతీ పార్వతీ నీ
పూర్వీకల్యాణి - ఆది
పల్లవి:
పరశివ సుదతీ పార్వతీ నీ
పదయుగ సేవాసక్తి గల నిజభక్తి నిడి బ్రోవవే
॥పర॥
అనుపల్లవి:
ధర నరుదై దొరకు ఈ నరజన్మమందే దృఢ
తరముగ నామది రంజిల్ల నిష్కామ భక్తితో నిను సేవింతు
॥పర॥
చరణము(లు):
తీరని భవ భారముచే ఈ భువి నిజ
దారసుత ధనయశోకాముడనై బరగి
ఏదారి దోచక నీదరి చేరి వేడితి జగత్‌
కారిణి భవతరణి జ్ఞానానంద తీర్థార్చిత
॥పర॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - paraSiva sudatI pArvatI nI - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )