కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ ఏమి కావలెనే మనసా భువి శివ
కేదారగౌళ - ఆది
పల్లవి:
ఏమి కావలెనే మనసా భువి శివ
కామినీ మది పదకంజ భక్తి కన్నా మన
॥కేమి॥
అనుపల్లవి:
కామితార్థ ఫలము లేకాల మొసగు
ప్రేమరూపిణి జనపెన్నిధిగా మన
॥కేమి॥
చరణము(లు):
వేదశాసనాను వర్తనులై
విధిహిత కర్మాచరణముచే కర్మశీలుడై
మోదమలర పరతత్త్వోపాసన చేయు శ్రీ
దేవీగానసుధాపాన మత్తచిత్తుల కిక
॥నేమి॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - Emi kAvalenE manasA bhuvi Siva - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )