కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ దేవీ కామాక్షీ పర
మాయామాళవగౌళ - ఆది
పల్లవి:
దేవీ కామాక్షీ పర
శివదేహార్ధదాయినీ నన్ను బ్రోవవే
॥దేవీ॥
అనుపల్లవి:
నీవే త్రిభువనాధీశ్వరి యని పొగడి
దేవేంద్రాది సురభూసురులెల్ల సేవింపరె
॥దేవీ॥
చరణము(లు):
చిరకాలముగ నీ చరణాంబుజము లే
మర కారాధింపుచు మదివేడితి జననీ
శరదిందుముఖి కాంచీపురాధీశ్వరీ
ధర నిరుపమ జ్ఞానానంద తీర్థార్చిత
॥దేవీ॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - dEvI kAmAxI para - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )