కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ పరాత్పరీ శివకామేశ్వరీ నీ
నాదానందరంజని - ఆది
పల్లవి:
పరాత్పరీ శివకామేశ్వరీ నీ
పదాబ్జములే మది సదాభజించు గౌరీ
॥పరాత్పరీ॥
అనుపల్లవి:
పురాణీ శరదిందునిభాననా
హరిహరాది సుర భూసురార్చితాఖండ
॥పరాత్పరీ॥
చరణము(లు):
ధరాతలిని మరపురాని నీ నామా
క్షరామృత పాన మేకాల మాశించి
శ్రీరాజేశ్వరీ సుహాసినీ నా
మొరాలించి బ్రోచు జ్ఞానానందతీర్థార్చిత
॥పరాత్పరీ॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - parAtparI SivakAmESvarI nI - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )