| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 43. బాసలు |
|
అన్న దమ్ముల బండి కట్టి పరుగు పరుగున పోయేవాడా బండీ దిగీ బాసలాడారా నాగూరె రాజా దండసొగసూ చూడగారారా. ఆకసమునా సందామామా అందరానీ సల్లని మామా అంతు తెలియని బండిబాటోయీ నాగూరె రాజా అందునే మన బాసలన్నీనోయ్. ఈదరాడ గట్ల మీద గింజకావలి కాసేదానా గంజికోసం ఎద్దులొచ్చాయే నాగూరె రాజా బాసలాడా మరలివచ్చానే. |