| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా |
| 15. దంపుపదం |
|
ఇల్లలికి ముగ్గెట్టి యింత పని చేసి ఈ యింటి సుందరి ఎందు పోయింది? సుందరి పుట్టిల్లు చూడబోయింది అన్నలతో వియ్యమ్ము లందబోయింది. వదినలతో వాదమ్ము లాడబోయింది. వచ్చేవె పోయెవె ఓ రామచిలుకా వచ్చి మాకన్నారి వార్త తెలుపవె పొద్దున్న వచ్చేవు బొంకేవు చిలుక న్యాయములు పలుకవే నా బాల తోడు. పట్టుచీర కొన్నారు పయనమైనారు పణతి మీ అన్నలు వస్తమన్నారు వెలచీర కొన్నారు వేడ్కపడ్డారు వెలది మీ అన్నలు వస్తమన్నారు. చద్దెన్నం కడివెడు చల్ల కడవెడు చాల ఆవులమంద నాకు కావలెను వేడన్నం కడివెడు వెన్న కడివెడు వేయి ఆవులమంద నాకు కావలెను. |