| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
037. కవ్వము పాట
| ఈ కవ్వము పాట కిటతక కిటతక అని నాలుగక్షరాల ఆవృతాలతో నడుస్తూ కోలాటాని కనుకూలముగా ఉన్నది. కోలాటపు పాటే అన్నా నమ్మవచ్చును. |
|
అన్నా బిందేటి పాలు - కిన్నెరల మోత అమ్మా చేసేదీ చల్లోయీ అమ్మా చేసేదీ చల్లా - కవ్వాల మోత రాగిదీ కవ్వామోయీ రాగిదీ కవ్వాము - రవ్వాడే వెన్నె చింతాదీ కవ్వామోయీ చింతాదీ కవ్వామూ - చిల్లాడె వెన్న దంతేదీ కవ్వామోయీ దంతేదీ కవ్వామూ - ధ్వనులెల్ల చల్ల ఉక్కూదీ కవ్వామోయీ ఉక్కూదీ కవ్వామూ - ఊగోచు వెన్న రేపల్లె వాడలోయీ రేపల్లి వాడల చల్లమ్మ చల్ల |