| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
039. రాసగుమ్మడి
| పని ఆయాసాన్ని తగ్గించుకోటానికి పాడిన పాటలు ఆ పనిని గురించిన ఊహల్నే కీర్తించనక్కరలేదు. అన్యాపదేశపుటూహలూ, ఎత్తిపొడుపులూ, ఆశ్చర్యాలూ ఏవైనా ఉండవచ్చు ఈ పాటల్లో. అందుకే ఒక్కొక్క చోట వీటి భావార్థాన్ని తెలుసుకోవటము కష్టము. ఈ రెండు పాటల్నీ చూడండి. |
| గుమ్మా! గుమ్మన్నలార! గుమ్మన్నలారో! | నా రాసగుమ్మడీ |
| తూరుపునున్నాది! తారుపుగుల్లో! | ॥నా॥ |
| తారుపు గుల్లాకు! తవ్వంత కొప్పో! | " |
| తవ్వంత కొప్పూకి! గుప్పుడేసి పూలో! | " |
| గుప్పుడేసి పూలకి! తాకట్టు సరుకో! | " |
| తాకట్టు సరుకీ కి! తాగుబోతు మొగుడో! | " |
| తాగుబోతు మొగుడీకి! తాళింపు కూడో! | " |
| తాళింపు కూడూకు! తాటికాయ పులుసో! | " |