| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
041. కాకర పువ్వొప్పునే
| 1 | |
| పల్లవి: | కాకర పువ్వొప్పునే? గౌరమ్మ! కాకర పండొప్పునే ॥గౌ॥ |
| మిత్రం: |
కాకర, పువు మీద! వాలిన చిలుకలు వసంత రేకులు, గైకో గబ్బలు మైకో మేడలు, చందమామ నీడలు సవరపు దండలు! ఆ గడియలో శ్రీ గడియలు - దంచిన పాలు। ధరణికి లొంగవు। దానత్త పోసిన। పట్టెళ్ళు। కో; కో; తడపలు। రాముడుయ్యలు। గంటసిరి మువ్వలు। గౌరమ్మా! నీ సుతుడేడే? వాడిన పువ్వులు, వడిలో బోసుక వాడలు నెలికిన। లేడమ్మా! సరి, మేడలు నెలికిన। లేడమ్మా! |
| 2 | |
| పల్లవి: | చిక్కుడు పువ్వొప్పునే? గౌరమ్మ! చిక్కుడు కాయొప్పునే? |
| మిత్రం: | చిక్కుడు పువు మీద। వాలిన చిలుకలు (పై మాదిరిగా మిగిలినది పాడవలయును.) |
| 3 | |
| పల్లవి: | బీరయ్య పువ్వొప్పునే? గౌరమ్మ! బీరయ్య పిందొప్పునే? |
| మిత్రం: | బీరయ్య పువు మీద। వాలిన చిలుకలు (పై మాదిరిగా మిగిలినది పాడవలయును.) |