| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
059. గోపిరెడ్డి
| గుఱ్ఱాల గోపిరెడ్డి చిన్నపరెడ్డి వలెనే చండశాసనుడై యుంటాడు. బాధితులు నలుగురు హఠాత్తుగా చేల నడుమన పట్టి నరికినారట. పోతే పోయెను. చావని వారొకరు గలరా? గోపిరెడ్డి ఎటువంటి వాడు? శేరు శేరు వెండిమురుగులతో, దువ్వు నిక్కిన మీసముతో కట్టవ మీద పోతూ ఉంటే 'కలకటేరు' సాగినట్లే! |
|
ఓ గుఱ్ఱాల గోపిరెడ్డి దాచేపల్లికి దానమైతివా శేరు శేరు యెండి మురుగుల్ చేతులాకు బెట్టుకోని కట్టవమీద వస్తావుంటే కలకటేరనుకొంటిర కొడకా వయ్యారి కొడకా బంగారు కొడకా దాచేపల్లికి దానమైతివా ఆ పక్క ఒక సేను ఈ పక్క ఒకసేను నడుమ సాపసేను సందున నిన్ను నలుగురు బట్టి నరికిరి కొడక వయ్యారి కొడకా చిన్నారి కొడకా దాచేపల్లికి దానమైతివా |
| గోపిరెడ్డి దౌష్ట్యమేదో తెలియరాదు. |