| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
071. ఎదురుచూచే వదిన
| బావమీద పిల్లదానికి చాలా మక్కువ. బావ ఫలానినాటికి వస్తానని చెప్పి 'దేశము' నకు పోయినాడు. గడువులు దాటినవి, రాలేదు. ఆమె ఆందోళనమును గుర్తించండి. |
|
ఏ ఒదినా ఏ ఒదినా ఎందుకేడుత్తావు ఎర్రినా ఒదినా నువ్వెంటనే సెప్పు దేశమెల్లిన మీ అన్న తిరిగి రాలేదు తిరుగొత్తె బాగున్ను తీర్తమెలుదూము ఎల్లినోడెల్లినట్టె ఉండిపోతాడ రేపోమాపో గాని తిరిగొత్తాడొదిన సెప్పెల్లిన గడువూలు దాటిపోనాయి సెట్టెక్కి సూడోలె వత్తున్నడేమొ సెట్టొద్దు సేమొద్దు ఊరుకో ఒదిన రాబోయె మాయన్న రాకమానడు సూసి సూసీ కళ్ళు కాసినై కాయాలు మేసేటి ఆవూలు మానినై మేతాలు |
| కలత ఎక్కడికి పోగలదు? ఆవులకు కూడా ప్రాకినది. |