| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
101. టనానా టంకుచెలో
| గారడీ వాడు ఏలపాటల పుట్ట. శతాబ్దాల మెట్లమీద మారిపోకుండా దిగివచ్చిన యెమ్మెకాడు. ఇది లోక వ్యవహారాలన్నిటినీ ఎత్తిచూపు పాట. ఈ వరసని చరణాలు ఎన్నైనా వుంటవి. మచ్చుకు కొన్ని. |
| నామగడు వాడకెళ్ళే నాకు తోడు ఎవరు లేరూ కోడి కూసే వేళదాకా తోడురారా వన్నెకాడా | ॥టనాన॥ |
| చింతచెట్టు చిగురు చూడూ, చిన్నదానీ యీడు చూడూ అద్దములో నీడ చూడూ, ఇద్దరికీ జోడు చూడూ | ॥టనాన॥ |
| నరసాపురము నుంచి నలిగి నలిగొస్తంటే తాళ్ళపాలెము కాడ తగిలింది జ్వరమూ | ॥టనాన॥ |
| చంక లోని నీళ్ళకడవా - నీడ జూచి నిందకట్టిరి ఇద్దరికీ యిట్టమయ్తె - ఎవరిదేమి భయ్యమె | ॥టనాన॥ |
| ఇంటి మొగుడికి వంటెద్దు బండీ - రంకు మొగుడికి రెండెడ్ల బండీ మధ్యతిరిగే లాల్గాడికి- దొరలు ఎక్కేమరలబండి | ॥టనాన॥ |
| ఇంటి మొగుడికి యీతకల్లు - రంకు మొగుడికి తాటికల్లు మధ్యతిరిగే లాల్గాడికి- దొరలు త్రాగే బ్రాందిసీసా | ॥టనాన॥ |
| తల్లిపిల్ల నిడిసి యాడు - సేసుకున్న భార్యనిడిసి దొమ్మరదాని యెంటపోతే - డోలు మెడకు యేసెరా | ॥టనాన॥ |
| కల్లు తాగి ఒళ్ళు మరసీ కైపు యెక్కి తిరగబోకూ పెళ్లి చేసి పంపుతారూ పెందలకడ మేలుకోరా | ॥టనాన॥ |