| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
114. ఐలేసా
| ఏలియాలా ఏలియాలా ఏలియాలా ఏలియాలా ఐలేసా జోరు సెయ్యి ఐలేసా జోరు సెయ్యి అయిలపట్టు ఐలేసా, బల్లకట్టు ఐలేసా అద్దిరబాబు ఐలేసా, అక్కడ పట్టు ఐలేసా సాపసుట్టి ఐలేసా, సంకనెట్టి ఐలేసా సందమామ ఐలేసా, అందముగా ఐలేసా ఐలేసా జోరుసెయ్యి, ఐలేసా బారుసెయ్యి సన్నజాజి ఐలేసా, సీరకట్టి ఐలేసా పొన్నపూలు ఐలేసా, అహ కొప్పునెట్టి ఐలేసా సిన్నదొచ్చి ఐలేసా, కన్నుగీటె ఐలేసా |
| వేదము వేంకటరాయ శాస్త్రి గారు "జోర్శెయ్ బార్శెయి" అన్న పాదాంత పదాలతో కొన్ని పడవ పాటలు రచించినారు. వానిలో సొగసుకత్తె ప్రశంస లేదు. |