| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
116. భీమరాజు పదము
| - వారిలో భీమరాజు ఒకడు. భీమరాజెట్లాంటి వాడు? |
|
వాడమీద వన్నెకాడో భీమరాజు వాసనకి సంపెంగ వనమూ చేతినిండ వుంగరాలో భీమరాజు చెప్పరాని చక్కదనమూ ॥వా॥ కాయపంచెలు కట్టుకొని భీమరాజు కిర్రు చెప్పులు తొడుగుకోని కర్ర చేత బట్టుకొని భీమరాజు కలకటేరు లాగొచ్చేను ॥వా॥ కాకినాడ రేవులో భీమరాజు కేవుగట్టి వోడ ఎక్కి రంగురంగుల బావుటాతో భీమరాజు రంగు సేసి రంగమెల్లే ॥వా॥ |