| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
119. ఓడెల్లి పోతున్నది
| పాపము ఆ చిన్నది ఏమి చేయగలదు. ఓడ కంటికి కనబడునంత వరకూ ఏడుస్తూనే ఉన్నది. |
|
ఓడెల్లి పోతున్నది మారాజో ఓడెల్లి పోతున్నది చెన్నాపట్నం రేవులోన చెట్టా పట్టాలేసుకొని చెవిలో గుస గుసలేమో చెప్పిపోయిన మారాజో ... ఓడెల్లి కాకినాడ ఈదుల్లోన కాటుక కన్నుల జూచి కన్నీళ్ళు చేత తుడిచి కనికరించిన మారాజో నీవందకత్తెవాని నిలువూటద్దాన చూచి నీడ జూచి మురిసిపోయిన నీటుగాడవు మారాజో భీముని పట్టాములోన పిన్నపెద్దలందరు జూడ పెద్దా పందిరిలోన పెళ్ళాడిన మారాజో కంచంలో బువ్వెట్టుకొని కమ్మని యెన్నెల లోన కసిగాటు కొట్టుకొంటూ కలవరించిన మారాజో అందమైన నీ మోము చందురూని చూస్తూంటె గుండె చల్లబడతాదాని గునిశాడిన మారాజో |