| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
129. పిలుపు
| ఇది పిల్లవాని విరహమును తెలుపు పాట. వెన్నెలలో మల్లెపూల పందిరి క్రింద వెండి కట్ల కిన్నెర పట్టి కూర్చున్నాడు. ఆమె వచ్చిన నవ్వులోనే తెల్లవారునట. అనుభవములను మీదు కట్టి ప్రాచీన సంస్కృత కవుల వర్ణనలను, అలంకారములను నెమరు వేస్తూ రచించే పండితుల వర్ణనలు ఈ పాట పొలిమేరలను చేరగలవేమో చూడుడు. దీనిని విన్నప్పుడు ఉమర్ ఖయాము జ్ఞప్తికి వచ్చును. ఇట్టి 'పిలుపును వహించుటకు గాలికి, మేఘునికి, చంద్రునికి కూడ సంతోషమే కదా!' |
|
వేళ జూడ వెన్నెలాయె, వెండ్లికట్ల కిన్నెరాయె మల్లెపూల పందిరాయె, వయ్యారి రావె నవ్వులోనె తెల్లవారును కొండగోగులు పూసెనేమొ, కొండ నిమ్మలు కాసెనేమొ దొండపండు లాంటి పెదిమె - వయ్యారి రావె మనసు ఎవరి పాలు జేతును మల్లెపూవులు పూసినట్లు మళ్లి మళ్ళి మాటలాడు మల్లెపూల వంటి మనసు, వయ్యారి రావె పూలులెవరి పాలు జేతును నందిపూసె కందిగాసె కందికొసలు నంది మేసె అందమైన మేలి నడల వయ్యారి రావె గంధమైన పంపబోతిని |