| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
132. మాఁవ
| ఉల్లిపూలా పడవా గట్టి మాఁవ! మల్లిరేకుల తెఱను దించి నాగులేటి వాగులోన మాఁవ! తేలీ పోదామా? మొగిలిపూల తేరూ గట్టి మాఁవ! మొగిలిరేకుల గొడుగు పట్టి మొగులు మేసే కొండా మీద మాఁవ! ముద్దుగానే ఎళ్లూదామ |
| 'కుంభగత ప్రదీప కళికాశ్రీ దోప నెందుంబో కెందే నింద్రియముల్ రహి\న్ గను' ఇంపు కోరలేదీ ప్రేయసి. మొగిలిరేకు గొడుగుపట్టి మొగులుమేసే కొండ మీద నీడ బొమ్మలవలె గోచరిస్తుండడమే ఈమె కాంక్ష. |