| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
138. ఓబులేశుని పాట
| ఓబులేశునీ కొండలనడుమా వొంచె గడ్డీ కోసేదానా వొంచెగుడ్డా వొల్లెగుడ్డేమే ॥హరి ఓబులేశ॥ గిద్దెలగిరీ కొండాల నడుమా యెద్దులు కాచే ముద్దూల మరదీ నన్ను చూసీ నవ్వబోకోయి ॥హరి॥ కట్టమీద నుంచెళ్లే దానా కాలు కురౘా చిన్నదానా కాసులిస్తా యెంట వస్తావా ॥హరి॥ ముందటరకా దున్నేవాడా ముద్దుల మేనత్త కొడుక దాపటెద్దుకు దప్పికాయెనోయీ ॥హరి॥ |
| ఎన్ని చరణాలుంటే తనివి తీరగలదు ఈ పాటతో. గడ్డిమూట కట్టుటకు లక్ష్మీదేవికి వేరే 'గుడ్డ' లేక వల్లెలో మూట గట్టినదట; సరి. చిలిపి చూపుల అహోబిలేశుడూరకొన గలడా? |