| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
161. నాయుడు
| ఇది పక్కా వీధిసాని, రూపాయలు, కాసులు, ముక్కుపుడక కడియాలు, పావడలు, నాగరము, మట్టెలూ ఎన్నో పుణుకుకున్నది. చివ్వరికి? వినండి. |
|
నాయుడోళ్ళింటికాడ । నల్లతుమ్మ చెట్టుకాడ నాయుడేమన్నాడే పిల్లా? అబ్బ; ఎంత వింతగున్నావే పిల్లా! నాయుడోళ్ళింటికాడ । నల్లతుమ్మ చెట్టుకాడ నాలుగు రూపాయలిస్తానన్నాడమ్మా! | అబ్బ నా గుండె ఝల్లుమన్నదేలమ్మా |
|
కోమటోరింటికాడ । గున్నమామిడి చెట్టుకాడ కోరి కోరేమన్నాడే పిల్లా? కోమటోరింటికాడ । కొట్టు బాజారు కాడ కోరి; కోరి; రమ్మన్నాడమ్మా! | ॥అబ్బ॥ |
| కరణం గారింటికాడ । కారుములక చెట్టుకాడ, కాముడేమన్నాడే పిల్లా? కరణం గారింటికాడ । కన్ని మామిడి చెట్టు క్రింద కాసులు పేరిస్తానన్నాడమ్మా! | ॥అబ్బ॥ |
| మునసబు గారింటి కాడ । ముందల దరవాజుకాడ అతడేమన్నాడే పిల్లా? మునసబు గారింటి కాడ । ముందల దరవాజులోన ముక్కుపుడక లిస్తానన్నాడమ్మా! | ॥అబ్బ॥ |
| మాలపల్లి తూముకాడ । మల్లె పువ్వుల తోటకాడ బాలుడేమన్నాడే పిల్లా? మాలపల్లి తూముకాడ । మల్లె పువ్వుల పందిరి క్రింద మల్లి, మల్లి రమ్మన్నాడమ్మా! | ॥అబ్బ॥ |
| క్రిందవి కడియాలు, మీదవి పావడాలు నెత్తి మీద నాగరము । ఏ దేవుడిచ్చేడే పిల్లా? కడియాలు, కామరాజు । పావడాలు పాపయ్య నాగరము నాగరాజు । నన్ను కోరి, కోరి; యిచ్చేరమ్మా! | ॥అబ్బ॥ |
| ముంతంత కొప్పు మీద । మూడు చేమంతిపూలు ఏరాజు పెట్టేడమ్మా! అబ్బ । ఎంత చక్కగున్నావే పిల్లా! చేమంతి పువ్వూలు । చెంగూలోన బెట్టి కోరి, కోరి; పిలిచేడే । నాయుడు | ॥అబ్బ॥ |
| కాళ్ళకు కడియాలు । వ్రేళ్ళకు మట్టెలూ నాయుడెప్పుడిచ్చేడే పిల్లా? కాసులుపేరు వేసుకుని । కాలువ గట్టున వెళ్లుతుంటె కాని పట్టు పట్టాడే నాయుడు | ॥అబ్బ॥ |
| ఎలమంచిలి రోడ్డు మీద । తాలూకా కచేరికాడ తాళపాలెం రేవులోను । పిట్లాకోనేరు కాడ ఎగిరి, యెగిరి తన్నేడమ్మా | ॥అబ్బ॥ |