| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
164. ప్రత్తి చేను
| సూరేపల్లి ముద్దులబావను చూచేదెన్నటికో ఊరి ముందటి పత్తిచేను వేసేదెన్నటికో అది పూసేదెన్నటికో మరి కాసేదెన్నటికో |
| మొదట ముద్దులబావను ఈ ముగ్ధ ఊరి ముందటి ప్రత్తిచేనిలో కలసినది, మరల గలియుటకు ఆ పరిస్థితులే రావలెనని ఎదురుచూచుచున్న ఈ వెఱ్ఱి "పండి తెల్లబాఱు వరి తోటలను జూచి" మొగము వంచి యేడ్చు మహిందుని ముగ్ధకు చెల్లెలు కావలయును. మొదట పాదము తీసివేస్తే శాలివాహన సప్తశతి లోనికి ఈ పాట సులువుగ ప్రవేశించ గలదు. |