| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
171. పయనము
| - ఇది ఎవరో ప్రాకృతుల లైలావలె నున్నది. తాను - అత్తింటికి కాబోలు - పయనమౌటను దయగలసామి ద్వారా వలపుకానికి తెలుపుచున్నది. |
|
ఒండుకోను ఒడ్డెపల్లె పండుకోను పల్లెసెరుపు ఒల్లకుంటే గొల్లపల్లెయ్యా, దయగల్ల సామీ రేపు పయనామాని దెల్పారోయి మిట్టలెక్కి చూసువాడ ముష్టికాకర సెట్టుకాడ ముద్దు ముద్దు గలసిపోయేరా, దయగల్ల సామీ రేపు పయనామాని దెల్పారా కానరానీ గట్టుమీదా కమ్మ గెగ్గెర సెట్టుకాడ కారణాలు సెల్లిపోయెరా, దయగల్ల సామీ రేపు పయనామాని దెల్పారా నీళ్ళులారా నిమ్మలారా నిత్యబూసిన మల్లెలారా నీళ్ళకొచ్చిన నీళ్ళగన్నోయి, దయగల్ల సామీ రేపు పయనామాని దెల్పారా |
| "ఈటికీ యేడామడేటికీ యేడామడెల్లుట్ల దురగమూ అత్తిల్లు నేబోతిరా సిన్నోడ పుట్టిల్లు దవ్వాయెరా మరిసినా మరుపు రాదోయి మరువెల్ల నీమీదెరా" అన్న పడుచు ఈ కోవలోనిదే. |