| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - సప్తమాశ్వాసము |
| వ. | అనిన నర్జునునకు నంగారపర్ణుం డి ట్లనియె. | 67 |
| సీ. |
ఆదిత్యునకుఁ బుత్త్రి యనఘ సావిత్రికిని | ననుజ యుత్తమలక్షణామలాంగి తపతి; యక్కన్య ధవళాయతేక్షణ | యౌవనసంప్రాప్త యైన, దానిఁ జూచి యక్కన్యక సురుచిరగుణముల | కనుగుణుం డగు నిర్మలాభిజాత్యుఁ బతి నెవ్విధంబునఁ బడయుదునో యని | తలఁచుచు నున్న యత్తపనుగుఱిచి |
|
| ఆ. |
భక్తిఁ దపము సేసెఁ బ్రభుఁ డజామీఢనం | దనుఁడు భరతకులుఁడు ధర్మవిదుఁడు సర్వగుణయుతుండు సంవరణుం డను | వాఁడు కృతజపోపవాసవిధుల. |
68 |
| చ. |
‘గగనమునందు నెందు నధికప్రభ నేను వెలుంగు నట్టు లి జ్జగతిఁ బ్రసిద్ధుఁడై వెలుఁగు సంవరణుండ మదీయపుత్త్రికిం దగుపతి; వీని కిచ్చెద ముదంబున నీలలితాంగి’ నంచు మా నుగ నెడ నిశ్చయించెఁ దపనుండు దదీయతపః ప్రసన్నుఁడై. |
69 |
| వ. | అంత నొక్కనాఁడు సంవరణుండు మృగయావినోదార్థి యయి వనంబునఁ బరిభ్రమించి అధికక్షుత్పిపాసాపీడిత పతితతురంగుం డయి యేకతంబ పాదచారి యై చని యొక్క పర్వతవనోద్దేశంబునందు. | 70 |
| క. |
కనియె నొక కన్యఁ గోమలిఁ | గనకప్రభ నిజ శరీరకాంతి నుపాంతం బున వృక్షలతావలిఁ గాం | చనమయముగఁ జేయుచున్న చంద్రనిభాస్యన్. |
71 |