| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - ద్వితీయాశ్వాసము |
| కాలగతి చెందిన కాలనేమి | ||
| చ. |
తడసితి వేల యింతవడి దాపుననే వసియించినట్టి యీ మడుగున కేఁగి రాకునికి మాకనుమానము దోఁచెనయ్య! యి ప్పుడు గలదేనిఁ గొంత గురుపూజకు విత్తము కాన్క వెట్టి నీ వడుగుము మందులెట్టివి ప్రియం బగునట్టివి నీకు నిచ్చెదన్. |
76 |
| చ. |
అనవుడుఁ గోపమెత్తి పవనాత్మజుఁ డప్పుడు నీకుఁ బూజ గొ మ్మని యురుముష్టిచేఁ బొడువ నాతఁడు డీకొని పక్షిరూపుఁడై తనుఁగదియంగవచ్చుటయు దాని నపక్షముగాఁగ ద్రుంచినన్ గినిసి మృగేంద్రుఁడై పొడువఁ గేసరిపుత్త్రుఁడు దానిఁ గూల్చినన్. |
77 |
| తే. |
అంత సుగ్రీవుఁడై వచ్చి యనిలతనయ! బ్రతికె సౌమిత్రి మందులపని తలంప వలదు రమ్మని నన్ను భూవరుఁడు పనిచె మగిడి పోదము పద మన్నమాట వినుచు. |
78 |
| వ. |
సుగ్రీవుం డని విచారించి కాకుండు టెరిఁగి వాని బాహుమధ్యంబునఁ బొడిచిన నతం డారూపంబు విడిచి శతశృంగుండై నొప్పించిన నలిగి జగత్ప్రాణ నందనుండు వాలంబున నడిచి కరంబులు ఛేదించి శిరంబుఁ ద్రుంచివైచి సింహనాదంబు చేసి జయలక్ష్మిం గైకొని. |
79 |