| కావ్యములు | మను చరిత్రము | ద్వితీయాశ్వాసము |
| ప్రవరుఁడు వరూధుని కామనను నిరాకరించుట | ||
| ఉ. |
నిక్కము దాఁప నేల ధరణీసురనందన! యింక నీపయిన్ జిక్కె మనంబు నాకు, ననుఁ జిత్తజుబారికి నప్పగించెదో? చొక్కి మరందమద్యముల చూఱలఁ బాటలువాడు తేంట్ల సొం పెక్కినయట్టి పూవుఁబొదరిండ్లను గౌఁగిట గారవించెదో? |
51 |
| క. |
అనుటయుఁ బ్రవరుం డిట్లను వనజేక్షణ! యిట్లు వలుక వరుసయె? వ్రతులై దినములు గడపెడు విప్రులఁ జనునే కామింప? మది విచారము వలదే? |
52 |