| కావ్యములు | మను చరిత్రము | ద్వితీయాశ్వాసము |
| ఆశ్వాసాంత పద్యగద్యములు | ||
| శా. |
నిస్తంద్రప్రతిభా! సుధీనుత! దిశోన్మీలద్యశశ్శ్రీవధూ హస్తాగ్రామలకాయమాన మహనీయాంభోజగర్భాండ! సై న్యస్తోమోత్థ రజోవ్రజ స్థగిత కృష్ణాగౌతమీ మధ్య భూ మ్యస్తోకోత్కలరాట్పురీ హరణ లీలావార్య శౌర్యోదయా! |
79 |
| క. |
బిసరుహనయనా నవవిధ కుసుమాయుధ! యవధికుధరకూటాంచల భూ విసృమర తేజ శ్చంపక భసల దసత్కీర్తి మలిన పరిపంథినృపా! |
80 |
| కవిరాజ విరాజితము. |
నల నృగ రంతి భగీరథ భారతనందన కల్ప! యనల్ప యశ శ్చులుకితలోక! విలోకివధూజన సూనశరానన! మానఖనీ! ప్రళయ ఘనాఘన ఘోష జయానక భాంకృతి భీమ చపేట లుఠ త్కలబరిగీకటకక్షితి రక్షక! కన్నడరాజ్య రమారమణా! |
81 |
| గద్యము. |
ఇది శ్రీ మదాంధ్ర కవితాపితామహ సర్వతోముఖాంక పంకజాక్ష పాదాంబుజాధీన మానసేందిందిర నందవరపుర వంశోత్తంస శఠకోపతాపస ప్రసాదాసాదిత చతుర్విధకవితామతల్లికాల్లసాని చొక్కయామాత్యపుత్త్ర పెద్దనార్య ప్రణీతంబైన స్వారోచిష మనుసంభవంబను మహా ప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము. |
|