| కావ్యములు | మను చరిత్రము | చతుర్థాశ్వాసము |
| స్వరోచి యాటవికుల కేలిక యగుట | ||
| క. |
అతఁడు మఱి తనకు మంథ క్షితిభృత్తటి విశ్వకర్మ చేసిన నగరి\న్ వితతాటవిక చమూ సే వితుఁడై సామ్రాజ్య మనుభవింప నొకతఱి\న్. |
10 |
| క. |
కరకా చిటపట రవ భీ కరమై పెళపెళ నినాద ఘనమై ఝంఝా మరు దుజ్ఘిత బిల మంద్ర స్వరమై యక్కొండ నొక్క వర్షము గురిసె\న్. |
11 |
| క. |
తెలతెల వేగిన నగ్గిరి జలజలఁ బ్రవహించు సెలల చప్పుళ్ళు శిఖా వల కుల కల కేకా కల కలములు గల తలపొలంబుఁ గనుఁగొనువేడ్క\న్. |
12 |
| ఆ. |
అన్నగాగ్ర మెక్కి యం దొక్క శశికాంత వేదిఁ గతిపయాప్త వేష్టితుండుఁ గుటజ విపిన పవన నట దలకభరుండు నగుచుఁ బ్రొద్దు జరుపు నవసరమున. |
13 |