| కావ్యములు | మను చరిత్రము | పంచమాశ్వాసము |
| ఆశ్వాసాంత పద్య గద్యములు | ||
| మ. |
అతులక్షాంతిగభీర! భీరహితచిత్తాంభోజ! భోజక్షమా పతివిద్యాపరిపాక! పాకరిపుశుంభద్భోగ! భోగాశిప త్రితరస్స్ఫూర్త్యనుభావ! భావభరిత శ్రీకాంత! కాంతారపా తితకాళింగకులేశ! లేశతరవృత్తి క్షీణవైరివ్రజా! |
105 |
| క. |
నాగాంబాసుత! జితకద నాగత మదనాగ సంగమానూప గృహా భోగా! భోగ పురందర! భోగీంద్ర శయాన పురుష పూజా ప్రవణా! |
106 |
| మాలిని. |
సరభస జయసరభస జయధాటీ చండ వేదండకోటీ కరవమథు హిమానీ కంపితాశా వధూటీ పరమహిత హసంతీ భావ భాగ్భూరితేజః పరుష దహనకీలా ప్రస్ఫుర చ్ఛక్రవాళా! |
107 |
| గద్యము. |
ఇది శ్రీమదాంధ్ర కవితా పితామహ సర్వతోముఖాంక, పంకజాక్ష పాదాంబుజాధీన మానసేందిందిర, నందవరపుర వంశోత్తంస, శఠకోప తాపస ప్రసాద సమాసాదిత చతుర్విధ కవితామతల్లికాల్లసాని చొక్కయామాత్య పుత్త్ర పెద్దనార్య ప్రణీతంబైన స్వారోచిషమనుసంభవం బను మహా ప్రబంధంబునందుఁ బంచమాశ్వాసము |
|