| కావ్యములు | మను చరిత్రము | షష్ఠాశ్వాసము |
| స్వరోచి కళావతినుండి పద్మినీ విద్యను గొనుట | ||
| క. |
విను మదియుఁ గాక పద్మిని యనఁ బరఁగిన విద్య నేఁ బ్రియంబున నిత్తు\న్ గొను నీవు తత్ప్రసాదం బున నీకు నభీష్టసౌఖ్యములు సిద్ధించు\న్. |
57 |
| వ. |
అని రహస్యంబుగా నవ్విద్య నాకు నుపదేశించి ముక్కంటి వాల్గంటి మింటిచొప్పునం జనియె. నేనును దద్వచనామృతా స్వాదనంబ యూఁతగాఁ బ్రాణంబులు వట్టుకొని యున్నదాన. నా స్వరోచి నీవ కాఁ దలంచెద, వంచనాలాపంబు లుడిగి య ప్పద్మినీ విద్యారత్నంబుతోఁ గూడ నన్నుం బరిగ్రహింపు మనిన నంగీకరించి య మ్మహీవిభుండు. |
58 |