| కావ్యములు | మను చరిత్రము | షష్ఠాశ్వాసము |
| చక్రవాకి విమర్శ విని స్వరోచి సిగ్గుపడుట | ||
| చ. |
పలుకులు వేయు నేమిటికి? భాగ్య సమన్విత నేన మద్విభుం డిలఁ గలధన్యుఁడంచు నెలుఁగెత్తి వరూధినిపట్టి ముందటం బలుకు రథాంగమానవతి పల్కు లతం డిల జంతు మండలీ విలస దశేషభాషలఁ బ్రవీణుఁడు గాన నెఱింగి సిగ్గునన్. |
75 |
| క. |
తల వాంచి యుస్సురని మదిఁ దలపోయుచు మానరాని తమకంబున నా నెలఁతలతో నూఱేఁడులు విలసితగతి సౌఖ్య మనుభవించుచు నెలమిన్. |
76 |